శేరిలింగంపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్, వాహనాలు పోయే పరిస్థితి లేదని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ అన్నారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చందానగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమయం అయ్యిందన్నారు. ఆయా సమస్యలను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా నాయకులు, అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచేయాలని అన్నారు. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.