శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని వికారాబాద్ జిల్లా ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కాంటెస్ట్డ్ ఎమ్మెల్యే, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామ్ చందర్ యాదవ్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పట్టణానికి ఆనుకుని కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి లేక ముఖ్యంగా పల్లె ప్రాంతాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు నాయకులు అభివృద్ధి చేయలేదని, ఇంతకుముందు కూడా అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రివర్యులకు వివరించామని తెలిపారు. ఇకనైనా జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సానుకూలంగా స్పందించారని భేరి రామచందర్ యాదవ్ తెలిపారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, అధ్యక్షుడు అశోక్ యాదవ్, గొర్ల కాపరుల అధ్యక్షుడు మధు యాదవ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.