శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్య నగర్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కాలనీలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా భాగ్య నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని, వరద నీటి కాల్వ ను నిర్మించాలని, కాలనీ లో ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని కోరారు. ఇందుకుఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC AE రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.