శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందడిగా సాగుతోంది. మహిళలు ఆసక్తిగా చేనేత హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. శాంతి చంద్రిక , వరవీణా మ్యూజిక్ అకాడమీ బృందం స్వరాంజలి అందరిని ఆకట్టుకుంది. చంద్రశేఖర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా గజవదాన, షియావ్ అష్టకం, కామాక్షి స్తుతి, బాలగోపాలా తరంగం, చంద్రశేఖరం , తక్కువేమి మనకు, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించారు. ఐశ్వర్య, భావన, మేఘన, హరిప్రియ, హర్షిని, ప్రీతిక, శ్రీవిద్య, సౌమ్య, మనస్వి లు ప్రదర్శించారు.