శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): గోపనపల్లిలోని అవంతిక గోదావరి అపార్ట్మెంట్స్ లో రూ.49.75 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌనిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.
డివిజన్ పరిధిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, సీనియర్ నాయకులు కిరణ్, భాను ప్రకాశ్, కిరణ్ కుమార్, లోకేందర్ రెడ్డి, రమేష్, ధీరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.