ఘ‌నంగా శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ కాపు సంఘం వ‌న‌భోజ‌నాలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పటాన్చెరులోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న‌ మైత్రి గ్రౌండ్ లో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఇస్నాపూర్ టు చందానగర్ సంఘాల కలయికతో 34వ కార్తీక వన సమారాధన జరిగింది. ఈ సమారాధనకు మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు బంధు మిత్రులందరూ సుమారు 5000 మంది పాల్గొని అత్యంత వైభవంగా కార్తీక సమారాధన మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ మహోత్సవానికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ హాజరై జ్యోతిని వెలిగించి వనభోజన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజ‌య్

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, అంజి రెడ్డి, నందీశ్వర్ గౌడ్, డాక్టర్ పుంజాల అలేఖ్య, చైర్మన్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ పర్సా పరమేశ్వరరావు, తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షుడు కొండ దేవయ్య, డాక్టర్ పుంజాల వినయ్, శంభుపూర్ కృష్ణ, కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ నల్ల అజయ్, నల్ల విష్ణు, నల్ల పవన్, నర్రా బిక్షపతి, గాలి అనిల్ కుమార్, సినీ ఆర్టిస్టులు కలగొల్ల రామానాయుడు, చరణ్ రాజు, శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షుడు విష్ణుమూర్తి, అప్పారావు, సూర్యచంద్రరావు, పూల కిషోర్, త్రినాధ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here