శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యో నారాయణ హరి అని అంటారని, అంటే వైద్యుడు దేవునితో సమానమని అన్నారు. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ దేవుడి తర్వాత చేతులెక్కి మొక్కవలసిన ఒకే ఒక వృత్తి వైద్యం అని, దాన్ని నిర్వర్తించేవారు వైద్యులని అన్నారు. దేవుడే వైద్యుడి రూపంలో పుట్టి ప్రజలను సకల రోగాల నుండి కాపాడుతున్నాడు అని తన నమ్మకమని, వైద్యులసేవ మరువలేనిది, ఎనలేనిది అని అన్నారు.