శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారాల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలలో నేషనల్ షెడ్యూల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాతోతూ హుస్సేన్ నాయక్ నడిగడ్డ తండ గిరిజన సంక్షేమ సంఘం నాయకులతో కలసి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను బోధిస్తూ దేశమంతా సంచరిస్తూ బంజారాలకు హితబోధ చేసిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. యావత్ భారత దేశం అంతా సంచరిస్తూ ఉప్పు అమ్ముకుంటూ, ఆవులను మేపుకుంటూ దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ మహారాజ్ ఏకం చేశారని అన్నారు. స్థిరనివాసం ఆవశ్యకతను తెలిపి, బంజారా జాతిని మూఢనమ్మకాల నుంచి హింస, మద్యపానం మొదలగు వ్యసనాలకు బానిస కాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని హితోపదేశం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్వర్ స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్, దశరత్ నాయక్, గోపి నాయక్, మోహన్ నాయక్, లక్పతి నాయక్, దేవా నాయక్, రెడ్యా నాయక్, యూత్ అధ్యక్షుడు దినేష్ నాయక్, సచిన్, శివ,లక్ష్మణ్, సాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.