శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానంలో పనిచేసేవారందరినీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా శాలువాతో సత్కరించి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను, స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అలాంటి ఆఖరి గమ్యంలో కార్మికులు అందించే సేవలు ఆదర్శప్రాయం, అతి ముఖ్యంగా కరోనా సమయం లో మహా ప్రస్థానం సిబ్బంది అందించిన సేవలను ఎప్పటికి మర్చిపోలేము, ఒక మనిషి చనిపోతే సొంత కుటుంబికులే రాలేని రోజుల్లో వారే అన్ని అయ్యి అంత్యక్రియలు చేయడం ఎంతో ఆదర్శమని అన్నారు. భవిష్యత్తులో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం మేనేజర్ రాజ్ కుమార్, మహా ప్రస్థానం సిబ్బంది, నాయకులు అంజమ్మ, దారుగుపల్లి నరేష్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.