ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ లో రూ.4.51 కోట్లతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. మొదటగా ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి తండా లో రూ.78.50 లక్షలతో సీసీ రోడ్లు, తాజ్ నగర్, గోపనపల్లి తండా లో రూ.73.00 లక్షలతో సీసీ రోడ్లు, గోపనపల్లి తండా లో రూ.90.00 లక్షలతో సీసీ రోడ్లు, నానక్ రామ్ గూడ‌ లో గల జన చైతన్య కాలనీ లో రూ.80.00 లక్షలతో మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు, నానక్ రామ్ గూడ‌ లోని జన చైతన్య కాలనీలో రూ.85.00 లక్షలతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు , ఖాజాగూడ కుమ్మరి బస్తీ లో రూ.45.00 ల‌క్ష‌ల‌ భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ కాలనీలలో ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలికమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం నరేందర్ రెడ్డి, డీఈ విశాలాక్షి, ఏ ఈ రషీద్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు రాజు, సుమన్, రమేష్, రంగస్వామి, రాజు, శ్రీను, యాదయ్య, నర్సింగ్ రావు, అరుణ్ గౌడ్, కృష్ణ, నాగరాజు, వేణు, వెంకటేష్, భారతి, నిర్మల, గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, లోకేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here