శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎన్ని సార్లు పాఠశాలను సందర్శించినా పరిష్కరం కాకపోడం సిగ్గు చేటు అని అన్నారు. వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నాలని అన్నారు. రాష్ట్రంలో సెలవుల అనంతరం తిరిగి ప్రారంభం అయిన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలతో చెప్తుంటే దానికి భిన్నంగా మదీనగూడ లో డ్రైనేజీ నీళ్ల మధ్యల విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బిజెపి నాయకులు సురేష్ కురుమ, కేవీ, కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.