నమస్తే శేరిలింగంపల్లి: పహల్గాం లో జరిగిన క్రూర నికృష్టమైన చర్య యావత్ భారతదేశాన్ని వులిక్కిపడేలా చేసిందని, అందుకు ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలంగాణ ఉద్యమకారులు, బీజేపీ సీనియర్ నాయకులు మడుపతి శివకుమార్ పేర్కొన్నారు. దాదాపుగా 26 మందికి పైగా భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మీరు హిందువులా లేక ముస్లింలా అని అడుగి మరి చంపడం వారి కృరత్వానికి నిదర్శనం అన్నారు. మీరు కల్మ చదవండి అంటూ వారి పిల్లలు మరియు వారి భార్యల ముందే ఏకే 47 లతో చంపడం చాలా క్రూరమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖచ్చితంగ ఈ యొక్క దుర్మార్గపు చర్యకు ప్రతిఫలంగా ప్రతి యొక్క ఉగ్రవాదిని క్రూరాతి క్రూరముగా చిత్రహింసలు చేసుకుంటూ చంపాలని డిమాండ్ చేశారు. ఈ రోజు యావత్ భారతదేశం యెదురు చూస్తోందని, ఎన్నో సార్లు పాకిస్తాన్ ను భారతదేశం క్షమించింది, కాని ఇప్పుడు పాకిస్థాన్ పై దాడి చేసినా సరే పర్వాలేదు అనే విధంగా యావత్ భారతదేశం ఎదురు చూస్తోందన్నారు. మన దేశ ప్రధాని గౌరవ మోడీ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ కు మరియు ఉగ్రవాదులకు తగ్గిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.