వర్చుసా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ‌లో ఉన్న రంగలాల్ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా ప్రముఖ ప్రొడక్ట్ , ప్లాట్ ఫామ్ ఇంజనీరింగ్ సేవల సంస్థ వర్చుసా కార్పొరేషన్ తన దాతృత్వ విభాగం, సీఎస్సార్ ఫండ్స్ ద్వారా వర్చుసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో GHMC భాగస్వామ్యంతో, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ద్వారా స్వచ్ఛందంగా చేపట్టిన సుందరీకరణ, పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా చెరువును కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, TGIIC జోనల్ కమిషనర్ ఎం. కవిత, gTech యాడ్స్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ మాధురి దుగ్గిరాల, గూగుల్ హైదరాబాద్ సైట్ లీడ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రంగలాల్ కుంట సరస్సు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంద‌న్నారు. ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుంద‌ని అన్నారు. వర్చుసా ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని, వర్చుసా హైదరాబాద్ క్యాంపస్ సమీపంలోని 3.5 ఎకరాల రంగలాల్ సరస్సును అభివృద్ధి చెందుతున్న పట్టణ పర్యావరణ వ్యవస్థగా తీర్చిదిద్దింద‌ని, చుట్టుపక్కల వారికి శుభ్రమైన, పచ్చదనంతో కూడిన వినోద ప్రదేశంగా మార్చింద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వర్చుసా కార్పొరేషన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ బజోరియా, సంస్థ ప్రతినిధులు మోహిత్ శర్మ, శ్రీనివాస్, సుబ్బారావు, రాహుల్ శర్మ, రేఖ శ్రీనివాసన్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ పాకాల, నాయకులు సంజీవ రెడ్డి, మంత్రి ప్రగడ సత్యనారాయణ, నాయినేని చంద్రకాంత్ రావు, MD ఇబ్రహీం, విష్ణు వర్ధన్ రెడ్డి, అనిల్, ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం, సురేష్ నాయక్, ప్రవీణ్, లక్ష్మణ్, పింటు , శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here