శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ సర్కిల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంత్ రావు సమక్షంలో నిర్వహించిన భారీ రోడ్డు షో లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని అన్నారు. కాలనీలలో, బస్తీలలో అందరి నోట హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలుపించుకుంటామని తెలిపినట్లు అన్నారు. విద్యావంతుడు యువతలో మంచి పేరు ఉన్న వ్యక్తి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నిలబెట్టే సత్తా ఉన్న నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపుంచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ యాదవ్, సిటీ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






