శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, MLA మర్రి రాజశేఖర్ రెడ్డిని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే నవతా రెడ్డి బీఆర్ఎస్‌లో తిరిగి చేరిన సందర్భంగా వారిని ఆమె కలిసి పార్టీ కార్యాచరణ గురించి చర్చించారు. శేరిలింగంపల్లిలో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె వారికి తెలిపారు. ఆమె వెంట శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి, నాయకులు గంగారం సంగారెడ్డి, చందర్రావు, అనంత రెడ్డి, గౌస్, ఫయాజ్ తదితరులు ఉన్నారు.






