వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 24 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్‌లోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పుజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రెడ్డి, నాయ‌కుడు రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. కాలనీ వాసుల సమష్టి కృషితో కార్యాలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి నివాసితుల సంక్షేమానికి ఈ నూతన కార్యాలయం కేంద్రంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here