శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతంగా ఆలోచించి బీజేపీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ , బిఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని, మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో చాలా వరకు విద్యావంతులు , ఉద్యోగులు ఉన్నారని, ప్రజలందరూ చైతన్యవంతంగా ఆలోచించి కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వసంత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్ , రాధాకృష్ణ యాదవ్, స్వామి గౌడ్, డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, వరలక్ష్మి, సురేందర్ ముదిరాజ్, రాజు శెట్టి , అంబటి అశోక్, సంజీవ్ , నందు నరేందర్ యాదవ్, కృష్ణ ముదిరాజ్, దయాకర్, మీలాల్ సింగ్, బబ్లు సింగ్, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, శేఖర్, నరసింహ రాజు, సతీష్ గౌడ్ , దుర్గారావ్ తదితరులు పాల్గొన్నారు.






