శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు విద్యుత్ ఫీడర్ల పరిధుల్లో ఉన్న పలు ప్రాంతాల్లో శనివారం నిర్దిష్టమైన సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మయూరినగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ లెజెండ్ ఫీడర్ పరిధిలోని లెజెండ్ అపార్ట్‌మెంట్స్, మయూరినగర్, 11కేవీ మయూరినగర్ ఫీడర్ పరిధిలోని మయూరినగర్, ఎస్‌బీఐ బ్యాంక్ రోడ్డు, ఓల్డేజ్ హోం, కోరుకొండ స్కూల్, 11కేవీ గోకరాజు రంగరాజు ఫీడర్ పరిధిలోని గోకరాజు కాలేజ్ రోడ్డు, బాలాజీ నగర్, మయూరినగర్, 11కేవీ రామ్ నరేష్ నగర్ ఫీడర్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ వర్టెక్స్ ప్రెస్టిజ్, వాటర్ వర్క్స్, మెట్రో స్టేషన్, హైదర్‌నగర్ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. అలాగే 11కేవీ రామ్ నరేష్ నగర్ కేబుల్ ఫీడర్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఓల్డేజ్ హోమ్, 11కేవీ ప్రశాంత్ నగర్ ఫీడర్ పరిధిలోని ఓల్డేజ్ హోమ్, ఇందిరమ్మ కాలనీ, వెంకట రాయి శ్రీ ఎన్‌క్లేవ్ లలోనూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదని అన్నారు. అదేవిధంగా 11కేవీ న్యూ కాలనీ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్, న్యూ కాలనీ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.





