శ్రీజా బృందావ‌నంలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీజ బృందావనం కాలనిలో ఏఈ ర‌మేష్ ర‌మావ‌త్‌తో క‌ల‌సి స్థానిక స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ ప‌ర్య‌టించారు. కాల‌నీలో కొనాసాగుతున్న‌ సిసి రోడ్డు నిర్మాణ‌ పనులను వారు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల‌పాటి మాట్లాడుతూ కాల‌నీల్లో చేప‌ట్టే అభివృద్ధి ప‌నుల నాణ్య‌తా ప్ర‌మాణాల విష‌యంలో రాజీ ప‌డ‌రాద‌ని, త్వ‌రిత గ‌తిన ప‌నుల‌ను పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్ర‌తి కాల‌నీలో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల‌నీ వాసులు పాల్గొన్నారు.

శ్రీజా బృందావ‌నంలో సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న మియాపూర్‌ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, ఏఈ ర‌మేష్ రాథోడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here