శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లోనీ వినాయక రెసిడెన్సి అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీనీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి నాయకుడు , కార్యకర్త ఎన్నికల ప్రచారంలో విశ్రమించకుండా ప్రతి ఒక్క ఓటరును ఇంటికి వెళ్లి కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనే నమ్మకాన్ని కలిగించి బీజేపీకి ఓటు వేసేలా చూడాలని సూచించారు.

షేక్ పేట్ డివిజన్ లోని అన్ని అపార్ట్మెంట్ వాసులను కలిసి ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, వారి గత పదేళ్ల విఫలమైన పాలనను ప్రజలకు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, గడిచిన 2 ఏళ్ల పాలనను ఎండగడుతూ ప్రతి ఒక్క కార్యకర్త , నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని, సంస్కరణలను , బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వారి అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తు పై వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించే వరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు అంజన గౌడ్, నాగరాజ్ , కృష్ణ బాబు , జివిఆర్ మూర్తి , సత్యనారాయణ, మల్లారెడ్డి, ప్రవీణ్ , ప్రశాంత్ , కుమార్ స్వామి, రాజేందర్ , శివారెడ్డి , శ్యాంసుందర్ రావు పాల్గొన్నారు.





