యూజీడీ పనుల్లో నాణ్యత పాటించాలి – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలో పక్కా ప్రణాళికలు రూపొందించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీలో రూ. 50 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీడీ నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం రాజ రాజేశ్వరి కాలనీలో స్థానిక ప్రజలు, నాయకులతో కలసి పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మిగిలి ఉన్న మంజీరా మంచి నీటి పైపు లైను పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీనిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజా రాజేశ్వరి కాలనీలో కొన్ని చోట్ల వివిధ రకాల మొక్కలను కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలసి నాటారు. రాజ రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రూప రెడ్డి, దీపక్ కచ్చావా, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్, శ్రవణ్, విశ్వేశ్వర రావు, శివ ముదిరాజ్, సంతోష్, వెంకటేశ్వర రెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రాజరాజేశ్వరీ కాలనీలో పాదయాత్ర చేస్తున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here