క్రీడాకారులకు‌ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో ఫ్రీడమ్ కప్ నిర్వహించారు. ఫ్రీడమ్ కప్ లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు‌ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతుల ప్రదానోత్సవం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ‌కృషి చేస్తుందన్నారు. క్రీడాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేను రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, బాలయ్య, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చందానగర్ ‌పీజేఆర్ స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విజేతలతో ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here