గౌడ హాస్టల్ నిర్మాణానికి సీవైజీ రూ. 4 లక్షల విరాళం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని, సర్దార్ పాపన్న గౌడ్ గౌడ కులస్తుల కోసం ఎంతగానో పోరాటం చేశారని, ఆయన అడుగుజాడల్లో గౌడలందరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారిగా ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని గౌడ హాస్టల్ నిర్మాణం కోసం శేరిలింగంపల్లి కి చెందిన సి. యాదగిరి గౌడ్ రూ. 4 లక్షల చెక్కును విరాళంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావుకు అందజేశారు. కుల సంఘం అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గౌడ హాస్టల్ కు విరాళం అందజేసిన యాదగిరి గౌడ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కి చెందిన పలువురు గౌడ కులస్తులు ఉన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా రూ. 4 లక్షల చెక్కును పల్లె లక్ష్మణ్ రావుకు అందజేసిన సి. యాదగిరి గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here