శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడిగా తోపుగుండ మహిపాల్ రెడ్డి 2వ సారి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు ఆయన పలు సమాజహిత కార్యక్రమాలను చేపట్టారు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ 50 వేల సహాయం అందజేయడంతోపాటు నల్లగండ్లకు చెందిన ఇద్దరు చిన్నారులకు చదువుకోసం రూ 20 వేలను అందించారు. వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్లకు సన్మానం చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రమణమూర్తి, కొండా విజయ్ కుమార్, శాంతిభూషణ్ రెడ్డి, గాలి కృష్ణ, సోమ నాగరాజు, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, మారం వెంకట్, కాశీనాథ్, భాస్కర్, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.