శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): కమ్యూనిస్టు నాయకుల అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కూన సుధాకర్ అన్నారు. గత ప్రభుత్వం కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేసి పుట్టగతులు లేకుండా ఓడిపోయారన్నారు. అదే కోణంలో ప్రస్తుత ప్రభుత్వం అరెస్టులు చేస్తుందని, ఈ ప్రభుత్వం తమ ఉద్యమాలను అణచివేయాలని చూస్తే గత ప్రభుత్వం గతే వీరికి కూడా పడుతుందని అన్నారు.