శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ.. భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో మియాపూర్ శివాలయం నుండి ప్రారంభమై మైత్రీనగర్ స్వామి వివేకానంద విగ్రహం వరకు పెద్ద ఎత్తున తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్ర ద్వారా దేశభక్తిని, సైనికుల పట్ల గౌరవాన్ని, ప్రజల ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు ఆర్ కె నాయడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, రాష్ట్ర నాయకులు నరేష్, రవీందర్ రావు, ప్రభాకర్ యాదవ్, కేశవ్ రావు, నాగుల్ గౌడ్, బోయిని అనూష మహేష్ యాదవ్ ,రాధ కృష్ణ, ఎల్లేశ్, రామ రాజు, మణిభూషణ్, డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్, జితేందర్, నాయకులు అనిల్ గౌడ్,మాణిక్ రావు, నర్సింగ్ యాదవ్ , వీరు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు, న్యాయవాదులు, వైద్యులు పాల్గొన్నారు.