హైకోర్టు లాయ‌ర్ల‌ను హ‌త్య చేసిన వారిని వెంట‌నే అరెస్టు చేయాలి

  • తెలంగాణ బ్రాహ్మణ‌ సేవా సమితి డిమాండ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పెద్దపల్లి జిల్లాలో బుధ‌వారం జరిగిన హైకోర్టు లాయర్ల‌ జంట హత్యలను తెలంగాణ బ్రాహ్మణ‌ సేవా సమితి తీవ్రంగా ఖండించింది. ఆ హత్యలు చేసిన నిందితులను వెంటనే అరేస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఆ ఘ‌ట‌న‌పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని, జంట హత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని తెలంగాణ బ్రహ్మణ‌ సేవా సమితి ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. దోషులు ఎంత పెద్ద వారైనా సరే వదిలి పెట్టరాదని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు సంఘం గౌరవ అధ్యక్షుడు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావులు డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here