శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 11, 12 తేదీలలో అరుణాచలంలో జరిగిన ప్రతిష్టాత్మకమైన 9వ జాతయ స్థాయి నంది నాట్యోత్సవంలో మదీనాగూడలోని కెనరి ది స్కూల్‌కు కు చెందిన ఉప్పలపాటి నాగ సాహితి తన ప్రతిభను చాటింది. చిన్ననాటి నుంచి చదువుతోపాటు కళలపై మక్కువతో కూచిపుడి నాట్యంలో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. నాట్య బిందు, అభినయ లాస్య వంటి బిరుదులెన్నో సాధించింది. ఇవే కాక లఘు నాటికలు రాసి నటించి నలుగురిని మెప్పించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కెనరి ది స్కూల్ చైర్మన్ శ్వేతా రెడ్డి, ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా, స్కూల్ హెడ్ నవీన్ కుమర్, కో అర్డినేటర్లు అపర్ణ ముక్తా, మహేష్ సాహితిని అభినందించారు.