భెల్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో రాజ్యాంగంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ B. R. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G. రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగ ఆచార్యలు R. రాందాసు మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు.

ప్ర‌తిజ్ఞ చేయిస్తున్న దృశ్యం

ఈరోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనినే గతంలో నేషనల్ లా డేగా జరుపునేవారము అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరిచేత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్)ను చదివించారు.భావి భారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి. అలాగే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు P. సురేష్, కమల్, నాగరాజు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here