శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఈనెల 14న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారని భేరి రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీసీలకు రాజకీయ అన్యాయం జరుగుతూనే ఉందని, ఇక బీసీలం ఒకరికొకరం చేతులు కలుపుకొని బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం తప్పదని అన్నారు. అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఎదిరించకపోవడం బానిసత్వం అవుతుందని అన్నారు. ఇప్పుడు నువ్వు తల ఎత్తి ప్రశ్నించకపోతే జీవితం మొత్తం తరతరాలుగా తలవంచకు బతకాల్సిందే. నువ్వు బీసీ వా.. బయటికి రా.. మనకు కావాల్సింది సాధించుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. తద్వారా బీసీలకు రాజకీయ అధికారం రావాలి. నువ్వు కదలక పోతే నిన్ను కదలకుండా చేస్తారు. ఈనెల 14న నిర్వహిస్తున్న రాష్ట్ర బందును మనమందరం కలిసి విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ఐకమత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకుడు డాక్టర్ అరుణ్ కుమార్, సీనియర్ బిసి నాయకుడు రామస్వామి, కంటెస్టడ్ ఎమ్మెల్యే ఒంగోలు శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






