శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మదీనాగూడ సర్వీస్ రోడ్డును సైబరాబాద్ జాయింట్ సీపీ డాక్టర్ గజారావు భూపాల్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వీరన్న, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ సందర్శించారు. స్థానికంగా కొనసాగుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను, ఫుట్‌పాత్ ఆక్రమణలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని ఫుట్ పాత్, సర్వీస్ రోడ్డు ఆక్రమణలను తొలగించాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. ఆల్విన్ కాలనీ నుంచి లింగంపల్లికి వెళ్లే దారిలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడాలని అన్నారు.






