త్రివేణి టాలెంట్ స్కూల్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జూన్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివేణి టాలెంట్ స్కూల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో యోగాపై అవగాహన పెంపొందించేందుకు వైవిధ్యభరిత యోగా శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డా. గొల్లపూడి వీరేంద్ర చౌదరి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతతను అందించే అమూల్య సాధన. విద్యార్థుల బాల్యం నుండి యోగాను అలవర్చుకుంటే వారి జీవితం సమతుల్యంగా మారుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు యాక్టివ్‌గా పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన యోగా ఇన్‌స్ట్రక్టర్లు రామచంద్ర రెడ్డి, టీం త్రివేణి విద్యార్థులకు యోగా ఆసనాలు, ధ్యానం, శ్వాస వ్యాయామాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here