శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఆకస్మికంగా సంభవించిన అగ్ని ప్రమాదానికి గురైన గుడిసెలను స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. బాధితులను పరామర్శించిన అనంతరం పలు సూచనలు చేస్తూ, అగ్ని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకుంటూ, అగ్ని ప్రమాదానికి గురైన గుడిసెలలో నివసించే నివాసితులకు అండగా ఉంటామని ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాలు త్వరగా అందేలా చూస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎల్లబోయిన సంతోష్ కుమార్, చిన్న కొండల్, లక్ష్మయ్య, రవి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.