గిరిజనులు ఆనందదాయకంగా జరుపుకునే పండుగ తీజ్ – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో జరిగిన తీజ్ పర్వదిన వేడుకలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, TGCS ఛైర్మన్ శ్రీ వల్యా నాయక్ , గౌరవ RTI కమిషనర్ శంకర్ నాయక్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తండాలో తీజ్ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గిరిజనులు ఎంతో ఆనందదాయకంగా జరుపుకునే పండుగ తీజ్ అని ప్రతి ఒక్కరికి తీజ్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, సెప్టెంబర్ 17న బంజారా భవన్, ఆదివాసీ భవన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన మహనీయుడు సేవాలాల్ మహరాజ్ అని, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలుచేశారని విప్ గాంధీ అన్నారు. దేశంకోసం , హిందు ధర్మంకోసం, ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. సేవాలాల్ మహరాజ్ దైవంతా సంబుతులని అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన నిత్య కృషి వలుడని, గిరిజనులు మంచి చదువులు చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆశించిన మహానుభావుడని, దేశ ప్రజలు ముఖ్యంగా యువత, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు BSN కిరణ్ యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్ , కాజా, ఓ. వెంకటేష్, నరేందర్ బల్లా, కార్తీక్ గౌడ్, గిరి మరియు నడిగడ్డ తండా వాసులు తిరుపతి నాయక్, స్వామి నాయక్, శంకర్ నాయక్, రత్నాకర్, లకపతి నాయక్, అబ్రహం, సుధాకర్, జీత్తు నాయక్, మధు నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్,గోపి నాయక్, తుకారాం నాయక్ దశరత్ నాయక్, హరి నాయక్ పాల్గొన్నారు

ఎమ్మెల్యే గాంధీకి మొక్కను అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here