సుభాష్ చంద్రబోస్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం- ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు శ్రీ రామ రక్ష అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.‌ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నగర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ది పొందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సాంబశివరావు, రెహమాన్ భాయ్, బాబ్ భాయ్, భృందారావు, వార్డు మెంబర్ రహీం, సుభాష్ చంద్రబోస్ నగర్ పార్టీ బస్తీ కమిటీ అధ్యక్షులు ముక్తార్ , మహిళ అధ్యక్షురాలు మొగులమ్మ, యూత్ అధ్యక్షులు చిన్న, డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా, డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు సంతోష్, సాజిద్, కృష్ణ యాదవ్, బుజ్జన్న, సత్యం, అంకారావు, రవి, రఘు, షరీఫ్, సలీం, రామకృష్ణ, నర్సింహా రావు, శ్రీను, యూత్ సాయి యాదవ్, సుధాకర్, అరవింద్, రాజ శేఖర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here