సామాజిక న్యాయం‌ కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం – ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో సామాజిక న్యాయం, ప్రజా పాలన కోసం సామాజిక శక్తులు వామపక్ష పార్టీలు ‌ఐక్యంగా ముందుకు సాగాలని అందుకోసం ఎంసీపీఐ(యూ) శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ తెలిపారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు భాగంగా హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ కార్యాలయంలో కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ అధ్యక్షతన రెండో రోజు జరిగాయి. సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ మృతిపట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ నూతన కార్యదర్శిగా కామ్రేడ్ గాదగోని రవి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలను విస్మరించిందన్నారు. ఒకే దేశం ఒకే ప్రజలు ఒకే మార్కెట్ అంటూ దేశ సంపదను, దేశ ప్రజల శ్రమను పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు దోచుకునేలా భారత రాజ్యాంగాన్ని సవరించి అధికార గర్వంతో పార్లమెంటులో దోపిడి అనుకూల చట్టాలు తెచ్చారని అన్నారు. యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టకుండా బీసీలకు తీరని అన్యాయాన్ని చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు మద్దికాయల అశోక్‌ చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బయటికి బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నాటకం అడుతుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అంటూ ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అంటూ మరోసారి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ప్రజాసమస్యలు విస్మరిస్తూ నియంతృత్వం పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.

ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ‌ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్

మార్చి 6న తాండ్ర కుమార్ సంస్మరణ సభ
ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గా భాద్యతలు నిర్వహిస్తూ అనారోగ్యం తో మరణించిన కామ్రెడ్ తాండ్ర కుమార్ సంస్మరణ సభను మార్చి 6 న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర నూతన కార్యదర్శి గాదగోని రవి అన్నారు. సభకు ఎంసీపీఐయూ జాతీయ నాయకత్వం తో పాటు రాష్ట్రం లోని వామపక్ష, బహుజన పార్టీల నేతలు, మేదావులు, ప్రజా తంత్ర వాదులు, ప్రజలు హాజరుకానున్నట్లు చెప్పారు.

ఎంసీపీఐయూ ‌రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గాదగోని రవి

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సింగతి సాంబయ్య, వనం సుధాకర్, సబ్బని కృష్ణ, కుంభం సుకన్య, పెద్దారపు రమేష్, వసుకుల మట్టయ్య, గోనె కుమారస్వామి, తుకారాం నాయక్, ఎన్ రెడ్డి హంసారెడ్డి లతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, పానుగంటి నర్సయ్య, వస్కుల సదక్క,‌ వంగల రాగ సుధా, జబ్బర్ నాయక్, వస్కుల గోపి, గాదె మల్లేష్, గుండె బోయిన చంద్రయ్య, టి.అనిల్ కుమార్, కంచ వెంకన్న, గడ్డం నాగార్జున, నర్రా ప్రతాప్, కర్రోల శ్రీనివాస్, మేత్రి రాజశేఖర్, కొనమొని వెంకటయ్య, యండి గౌస్, కొండ శ్రీనివాస్, ఇ.కిష్టయ్య, మానయ్య, ప్రజాసంఘాల రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here