నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో నుంచి తాను పనిచేస్తున్న హోటల్ కు వెళ్తున్నా అని భార్యతో చెప్పిన భర్త అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేష్ చందానగర్ లోని జై దుర్గా భవాని హోటల్ లో పనిచేస్తూ శాంతినగర్ లో భార్య అనితతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 21 వ తేదీన మల్లేష్ హోటల్ లో పనికి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లగా హోటల్ నిర్వాహకులు మాత్రం హోటల్‌కు రాలేదని అదే రోజు రాత్రి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. చుట్టు పక్కలా మల్లేష్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అప్పుల బాధ భరించలేక పోతున్నానంటూ రాసిపెట్టిన లేఖ బయటపడింది. మల్లేష్ భార్య జి. అనిత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్ ఎత్తు 5 ఫీట్లు, నలుపు రంగు, పొడవాటి మొహం కలిగి ఇంటి నుంచి వెళ్లిన సమయంలో సిల్వర్ కలర్ టీ షర్ట్, నలుపు రంగుగల పాయింట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు చందానగర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరని కోరారు.