శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): నార్సింగి మున్సిపాలిటీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా నిర్వహించిన సదర్ సమ్మేళనానికి నార్సింగి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గోర్ల వెంకటేష్ యాదవ్ ఆహ్వానం మేరకు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అట్టహాసంగా జరిగిన యాదవ సదర్ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సదర్ సమ్మేళనంలో అధిక సంఖ్యలో యాదవులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. సదర్ పండుగ ఐకమత్యానికి ప్రతిబింబం అని అన్నారు.
అందరూ కూడా ఐకమత్యంతో ఉండి మన రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించాలని కోరారు. యాదవుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శంషాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బండి శ్రీకాంత్ యాదవ్, గండిపేట్ ప్రశాంతి యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు గోకుల్ శివకుమార్ యాదవ్, గొర్ల హరీష్ యాదవ్, కుమ్మేర శివకుమార్ యాదవ్, మిద్దెల తేజ యాదవ్, మిద్దెల దీక్షిత్ యాదవ్, గొర్ల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.