శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తమను కలవడం జరిగిందని, కాలనీలో తలెత్తిన డ్రైనేజీ, మంజీరా మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, మంజీరా మంచినీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం కాలనీ అధ్యక్షుడు కేశవ్, కాలనీ వాసులు షాబుద్ధిన్, శ్రీధర్, సుబ్బారావు, కొండల్ రావు, రాంగోపాల్,సత్యనారాయణ, రెడ్డి నాయక్, అనంత రామ్ చారి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
