శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఘాట్ నిర్వహణపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకున్నానని, ఎన్‌టీఆర్ ఘాట్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని, బాధ తప్త హృదయంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. నందమూరి తారకరామారావు ఘాట్ నిర్వహణ బాధ్యతలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి కాబట్టి తానే స్వయానా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్లి, ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు, సుందరీకరణ పనులు వెంటనే చేపట్టేలా తన వంతు కృషి చేస్తానని తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చేపట్టేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
