కొండాపూర్‌లో ఆటోరిక్షాల ప‌ర్మిట్ల‌పై ప్ర‌త్యేక డ్రైవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి కొండాపూర్ వ‌ర‌కు కొండాపూర్ ఎంవీఐ, ఏఎంవీఐ మ‌నోజ్‌, ఇత‌ర ఆర్‌టీఏ సిబ్బందితో క‌లిసి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు సోమ‌వారం ఆటో రిక్షాల‌పై ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆటోరిక్షాల‌కు చెందిన ప‌ర్మిట్లు, ఫిట్ నెస్ స‌ర్టిఫికెట్లు, ఇత‌ర జిల్లాల‌కు చెందిన రిజిస్ట్రేష‌న్ క‌లిగిన ఆటోల‌ను త‌నిఖీ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డిపిస్తున్న 44 ఆటోల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here