శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడ వార్డ్ ఆఫీస్ వద్ద రూ. 32 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వరదనీటి కాలువ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వరదనీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, లింగం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.






