శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీలో ఉన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలసి సమావేశం నిర్వహించడం జరిగిందని, అరబిందో కాలనీ అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని, మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు.
అరబిందో కాలనీలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా మియాపూర్ డివిజన్ ప్రజలకు అన్నివేళల్లో అందుబాటులో ఉండడం జరుగుతుందని, డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, మెరుగైన ప్రజా జీవనానికి అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానని కార్పొరేటర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాము, చైతన్య, అరబిందో కాలనీ అసోసియేషన్ సభ్యులు నారాయణరెడ్డి, లోకేష్, రమేష్, కె ఏస్ బాబు, దిలీప్, రాజశేఖర్ రెడ్డి, రాజేష్, అనిల్, సుధాకర్, రవితేజ, శ్రీనివాస్ రెడ్డి, నగేష్ , సురేష్, అభినవ్ రెడ్డి, రాంప్రసాద్, రఘు రామ్ తదితరులు పాల్గొన్నారు.