శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో రూ. 9 లక్షల 20 వేల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 48 సీసీ కెమెరాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శిల్ప పార్క్ కాలనీ వాసులు తన విజ్ఞప్తి మేరకు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీ వాసులు ముందుకు రావడం చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని అన్నారు. ప్రతి ఒక్కరికి, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాలనీలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు. కాలనీ వాసులు ముందుకు రావడం చాలా అభినందనీయం అని, సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ తీసుకోవడం చాలా గొప్ప విషయం అని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీ వాసులకు విస్తృత ప్రచారంతో అవగాహన కల్పిస్తున్నారని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలిసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శిల్ప పార్క్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రామరాజు , సెక్రటరీ లవకుమార్, ట్రెజరర్ అమర్నాథ్, జాయింట్ సెక్రటరీ గుప్తాజి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.