శేరిలింగంపల్లిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్యస్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆయా పార్టీల నాయకులు, బీసీ సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. ఆల్విన్ ఎక్స్ రోడ్ బిజెపి కార్యాలయంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వా సత్యనారాయణ పాల్గొని పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త పూలే అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే సాంఘీక వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాడి, వెనుకబడిన కులాలలో చైతన్యం నింపిన ధైర్యశాలి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగులు గౌడ్, డీఎస్ ఆర్ కె ప్రసాద్, మనోహర్, రవి గౌడ్, వరప్రసాద్, లక్ష్మణ్ గౌడ్, జితేందర్, పృథ్వి కాంత్ గౌడ్, రాఘవేంద్ర రావు, జగన్ గౌడ్, నవీన్ కుమార్, బాబు రెడ్డి, సుబ్బా రెడ్డి, నవీన్, రవి ముదిరాజ్, చంద్ర శేఖర్, లక్ష్మణ్, పాపయ్య ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ ఎక్స్ రోడ్డులో‌ని కార్యాలయంలో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, మొవ్వా సత్యనారాయణ

రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో..
మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా అణగారిన బడుగు, బలహీన వర్గాల జీవితాలలో జ్యోతులు వెలిగించిన గొప్ప దార్శనికుడు, ఆధునిక నవ భారత వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సామాజిక సమానత్వం నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటిగా ప్రజలచే మహాత్మగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. పూలే సామాజిక తత్వవేత్త, ఉద్యమ కారుడు, సంఘసేవకుడని,కుల వివక్షతను కూల్చిన గొప్ప యోధుడన్నారు. సమాజం విద్యా పరంగా ఆర్ధికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి చెందుతుందని ఆశించిన ఆయన ఆశయానికి కృషి చేసినపుడే మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, కసిరెడ్డి సింధు రెడ్డి, రమేష్, రఘునాథ్ రెడ్డి, సదానంద యాదవ్, భూపాల్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, సీతారామరాజు, భరత్, అర్జున్, గణేష్ ముదిరాజ్, చంద్రశేఖర్ యాదవ్, నరసింహ, బాలు యాదవ్, సాయి, శ్రీనివాస్ యాదవ్, చిట్టి రెడ్డి ప్రసాద్, మధు యాదవ్, మదనాచారి , బాలాజీ, రవి నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…
మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఐజీ లోని ఎస్ ఓ ఎస్ ఆనాథ శరణాలయంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్ధినీ, విద్యార్థులకు స్వీట్స్, ప్రూట్స్, బిస్కెట్లు అందజేశారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించారని, బడుగు, బలహీన వర్గాలు, అన్ని వర్గాల మహిళలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని చాటి చెప్పిన మహోన్నతుడు అని అన్నారు. మహిళా విద్య దేశానికి సౌభాగ్యమని భావించి దేశ జనాభాలో సగ భాగమైన మహిళలకు 1848లో తొలి సారిగా మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన గొప్ప దార్శనికుడన్నారు. చిన్న వయసులో వితంతువులైన అన్ని వర్గాల మహిళలను, గర్భవతులను చేరదీసి వారికి అనాథ శరణాలయాలను ఏర్పాటు చేశారని చెప్పారు. పురుడు పోసి, వితంతువులకు వితంతు పునర్వివాహం జరిపించి వారి జీవితాలలో వెలుగులు నింపారన్నారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, శివరాం కృష్ణ, పద్మారావు, విష్ణుప్రసాద్, జనార్ధన్, భానోజిరావు, వికాస్ ఆశ్రమ నిర్వాహకులు నరోత్తమ్ సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంఐజీ అనాథశ్రమంలో చిన్నారులతో కలిసి పూలే జయంతి వేడుకలు‌ నిర్వహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

సగర సంఘం ఆధ్యర్యంలో….
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సగర సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు చంద్రకళ సగర, సరిత సగర, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు మన్యంకొండ సగర తదితరులు పాల్గొన్నారు.

పూలే జయంతిని పురస్కరించుకొని నివాళి అర్పిస్తున్న సగర సంఘం‌

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో…
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జోనల్ కమిషనర్ ప్రియాంక అల, జోనల్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఎంసి నరేందర్ రెడ్డి, చందానగర్ సర్కిల్ ఏఎంఓహెచ్ కార్తీక్, పీఓ మాన్వి, డీఈ విశాలాక్షి, శేరిలింగంపల్లి జోన్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, జేఏసీ చైర్మన్ తిరుపతి మహేష్, యూనియన్ సలహాదారులు కిరణ్ కుమార్ రెడ్డి, బాల్ రాజ్, కిష్టప్ప, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, గంగారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశప్ప, ఉపాధ్యక్షుడు అచ్యుత, శేరిలింగంపల్లి జోన్ అధ్యక్షుడు నాయక్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రెసిడెంట్ యాదయ్య, జోన్ కోశాధికారి తిమ్మప్ప, నంద కుమార్, శివ కూమార్ శ్రీనివాస్ గౌడ్, వేణు, అనిల్, హరీష్, విజయ్ తదితరులు ‌హాజరయ్యారు.

శేరిలింగంపల్లి ‌జోనల్ కార్యాలయంలో ‌పూలే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న జీహెచ్ఎంసీ ‌అధికారులు

బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో…
సమాజంలో నెలకొన్న ఆర్థిక సామాజిక అసమానతలపై నాటి పరిస్థితులలో ఏటికి ఎదురీది నట్లుగా పోరాట జ్వాల రగిలించిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్ )రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతిని పురస్కరించుకొని బీసీ జనగణన చేపట్టాలనే డిమాండ్ తో ఎం సిపిఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ నాటి రోజుల్లో విద్య అందరికీ అందుబాటులోకి రావాలని స్త్రీలు సైతం విద్య ద్వారానే అభివృద్ధి సాధిస్తారని, తన సతీమణికి సైతం విద్య నేర్పించి సమాజానికి అంకితమైన జంట మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు అని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి బహుజనుడు రాజ్యాధికారం కోసం పోరాడాలని అన్నారు. ఎం సిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి గాధ గోని రవి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి స్ఫూర్తితో బీసీ జనగణన సాధన కోసం బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేయాలని, అందులో భాగంగా ఏప్రిల్ 28వ తేదీన చలో ఇందిరాపార్కు ధర్నా కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వి తుకారాం నాయక్, సిహెచ్ మదు, మైదంశెట్టి రమేష్, పల్లె మురళి, సంజీవ్, ధనలక్ష్మి, వెంకన్న, కాంబ్లె మదు, సునిల్, యంయం గౌడ్, రవి, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావుపూలే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీఎల్ఎఫ్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here