నమస్తే శేరిలింగంపల్లి: సిద్దిఖ్ నగర్ బస్తి అభివృద్ధి కమిటీ ఎన్నికలలో నూతనంగా గెలుపొందిన బస్తీ కమిటీ కార్యవర్గం సభ్యులకు బిజెపి రాష్ట్ర నాయకులు యం. రవికుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన బస్తీ కమిటీ సభ్యులు బుధవారం రవికుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. బస్తీ కమిటీ అధ్యక్షునిగా బసవరాజు, అధ్యక్షురాలిగా లక్ష్మీ బాయి, జనరల్ సెక్రెటరీగా మహేష్ , కోశాధికారిగా ఆనంద్ ఎన్నికయ్యారు. బస్తి అభివృద్ధి కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు ముందుండాలని, సిద్దిక్ నగర్ బస్తి కి ఎల్లప్పుడూ మా అండదండలు ఉంటాయని బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ హామినిచ్చారు. రాబోయే శాసన సభ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు విక్రమ్, బిజెపి పార్టీ నాయకులు చందు ఉన్నారు.