నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమర యోధులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని బిజెపి శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, భువనగిరి జిల్లా బిజెపి ప్రభారి నందకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి నిరంకుశ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయ వాద ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారన్నారు. శ్యామ ప్రసాద్ సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, శేరిలింగంపల్లి మహిళ మోర్చ కో కన్వీనర్ బీ విజయ లక్ష్మి, సీనియర్ నాయకులు శాంతి భూషణ్ రెడ్డి, డివిజన్ ఓ.బీ.సి మోర్చ అధ్యక్షుడు ఇరుమల్ల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
