నమస్తే శేరిలింగంపల్లి: అతివేగం, నిర్లక్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టడంతో మృతిచెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గండిపేటకు చెందిన లోకిని రాకేష్ (20) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం ఈ నెల 5 న గండిపేట నుంచి కొండాపూర్ కు టీఎస్ 02ఎఫ్ ఏ 4322 నంబరు గల టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాకేష్ ను అతివేగంగా, అజాగ్రత్తగా కారును డ్రైవ్ చేస్తూ ఢీ కొట్టాడు. రాకేష్ తలకు తీవ్ర గాయలవడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని స్నేహితుడు తరుణ్ ద్వారా సమాచారం అందుకున్న రాకేష్ తండ్రి లోకిని కొమురయ్య ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి చూడగా తల వెనుక భాగంలో బలమైన గాయమవడంతో రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.