కమ్మ సేవా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ – ప్రభుత్వ విప్ గాంధీతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం వారి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కమ్మ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించడం సంతోషకరమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు శేరిలింగంపల్లి మండలం, మాదాపూర్ ఖానామెట్ గ్రామంలో సర్వే నంబర్ 11/1 లో కేటాయించిన ఐదెకరాల స్థలంలో భవన నిర్మాణానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వర రావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గానికి మాదాపూర్ ఖానమేట్ గ్రామంలో ఐదెకరాల స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కమ్మ సామాజిక కుటుంబ సభ్యుల తరుపున ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించిన సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆదర్శప్రాయులన్నారు. ఈ స్థలంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 170 గదులు, సమావేశ మందిరాలు, క్లబ్ హౌస్, బాల్ రూమ్స్, రెస్టారెంట్లు, లాన్స్, స్విమ్మింగ్ పూల్, అతిథి గృహాలు, విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన సదుపాయాలు, వారి కోసం ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్లు, హాస్టల్ ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. భవన నిర్మాణానికి ఎంతో మంది కమ్మ సోదరులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్ లో ఇతర కులాల వారికి కూడా కొంతమేర పేద మధ్యతరగతి వారందరికీ సహాయం చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ వివరించారు. భవన నిర్మాణంలో విద్యార్ధుల కు వసతి గృహం, విద్య నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కేంద్రం, వివాహాల కోసం కన్వెన్షన్ సెంటర్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అన్నిహంగులతో, సకల సౌకర్యాలతో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.

కమ్మ సేవా సంఘం భవన నిర్మాణ భూమి పూజలో కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర కమ్మ సంఘం సభ్యులు

సమిష్టి కృషితో భవన నిర్మాణం పనులను త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని ప్రభుత్వ విప్ గాంధీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ ప్రధాన కార్యదర్శి గంగ వరపు రామ కృష్ణ ప్రసాద్, కోశాధికారి కండె పనేని రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులు కలగర శ్రీని వాసరావు, బొడ్డు రవిశంకర్ రావు, చంద్రమౌళి, కార్యదర్శి పాతూరి వెంకటరావు, చపరాల దాస్, దుక్కిపాటి సయోజిరావు, ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 సాంబశివ రావు, మహా న్యూస్ వంశీ, బీసీసీఐ మాజీ సెలెక్ట్ కమిటీ చైర్మన్ ఎంఎస్ కే ప్రసాద్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు, రాష్ట్రంలోని 70 కమ్మ సంఘాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మాదాపూర్ ఖానామెట్ లో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో కమ్మ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here