నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా జె.శంకరయ్యను నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న శంకరయ్యను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇక్కడి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా మూడు నెలల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ఆమె స్థానంలో జూలై 25 వరకు ఫుల్ అడిషనల్ చార్జ్(FAC) అప్పగిస్తూ నిర్వహించాలంటూ జిహెచ్ఎంసి చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మమత శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా అదనపు భాద్యతలు స్వీకరించిన మరుసటి రోజునే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ డైరెక్టర్ ప్రస్తుతం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న శంకరయ్యను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా బదిలీ చేయడం ఆసక్తిగా మారింది.